schedule Thursday, May 21, 2026

ఇసుక, కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు:-  కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ 

calendar_today May 15, 2026
person Prajagalam News
ఇసుక, కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు:-   కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ 
(ప్రజాగళం,కుల్కచర్ల)   ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక,కలప రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ రమేష్ కుమార్ హెచ్చరించారు.శుక్రవారం ఉదయం కుల్కచర్ల మండల కేంద్రం శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొంరెడ్డిపల్లి గ్రామం దండు వెంకటయ్యకు చెందిన ట్రాక్టర్(టిఎస్ 34టిబి1228) ను,ఇబ్రహీంపట్నం కొర్ర సుమన్ కు చెందిన లారీ(ఎపి 16వి0955)లో కలప తరలిస్తుండగా తనిఖీ నిర్వహించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు.