వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి :- కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
May 16, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
కుల్కచర్ల మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు.శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,అనుకోకుండా వర్షం కురిస్తే రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతారని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట ఎఎంసి డైరెక్టర్ ఎల్లయ్య, రైతులు,ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకులు ఉన్నారు