schedule Thursday, May 21, 2026

మొక్కుబడిగా కుల్కచర్ల వైద్య సిబ్బంది అవగాహనా ర్యాలీలు

calendar_today May 16, 2026
person Prajagalam News
మొక్కుబడిగా కుల్కచర్ల వైద్య సిబ్బంది అవగాహనా ర్యాలీలు
  (కుల్కచర్ల) వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజల ఆరోగ్యంపై అవగాహనా కల్పించాల్సిన ర్యాలీలు మొక్కుబడిగా నిర్వహిస్తు చేతులు దులుపుకుంటున్నారు.శనివారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించాల్సిన ర్యాలీ కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గేటు కూడా దాటలేదని ఈ విధానం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే విమర్శలు వస్తున్నాయి.కేవలం ఉన్నతాధికారులకు కార్యక్రమం నిర్వహించామని చూపించడం కోసం మాత్రమే ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ తీసినట్లు ఫోటో తీయడం తోనే సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.