schedule Thursday, May 21, 2026

ఈనెల 29న ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం

calendar_today March 25, 2026
person Prajagalam News
  తాండూరు: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు కిమ్స్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్పహిస్తునట్లు ఐఎంఏ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 29 వ తేదీ ఆదివారం ఉ. 9 గం. నుండి సా.4 గం. వరకు (రిజిస్ట్రేషన్ సమయం మ. 2 గం. వరకు మాత్రమే) పట్టణంలోని ప్రముఖ ఆసుపత్రి సాయి తరుణ్ హాస్పిటల్, ఆదర్శ నగర్ నిర్వహించానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, డాక్టర్. మధు దేవరశెట్టి,డాక్టర్ తోట నరేందర్ కుమార్, ఐఎంఏ గౌరవ కార్యదర్శి డా. సి.హెచ్. అనిల్ కుమార్ రెడ్డి,కోశాధికారి డా. పి. జైదీప్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. రూ.19500/- విలువ గల క్యాన్సర్ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయని తెలిపారు.మామోగ్రఫీ పాప్ స్మియర్ బోత్ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్,ఎక్స్-రే ఎండోస్కోప్,అల్ట్రాసౌండ్ అబ్జామిన్ అండ్ పెల్విస్,సేఫ-125" "సిఎస్ ఏ" పరీక్షలు చేయబడతాయని మీ పాత మెడికల్ రిపోర్టులను తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించే క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్స్ప్రెస్ టెస్టులు ఉచితంగా చేపడతాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.వివరాల కోసం ఫోన్ నెంబర్లు :9966 572757/7993 145149/8186 027511 లకు సంప్రదించాలని పేర్కొన్నారు.