schedule Thursday, September 03, 2026

పిఎసిఎస్ లో సర్వసభ్య సమావేశం

calendar_today March 26, 2026
person Prajagalam News
పిఎసిఎస్ లో సర్వసభ్య సమావేశం
  వికారాబాద్ జిల్లా  బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నవాంద్గి లో గురువారం నాడు సర్వసభ్య సమావేశం సీఈఓ వెంకటయ్య,ప్రత్యేక అధికారీ రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశం సీఈఓ,ప్రత్యేక అధికారీ మాట్లాడుతూ మండల పరిధిలో పీఎసిఎస్ ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని కోరడం జరిగింది.అదేవిధంగా ఎల్టీ ఋణలు 23 శాతం చెల్లించారు.త్వరలో 50 శాతం చెల్లించి సహకరించాలని కోరారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని,యూరియా కోసం రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకొని పిఎసిఎస్ లో యూరియా తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పూర్ మేనేజర్ పి.రాములు, పిఎసిఎస్ సిబ్బంది రాజశేఖర్, బందెప్ప,ఫారుక్,తుకారాం, తదితరులు పాల్గొన్నారు.