schedule Thursday, May 21, 2026

రజక సంఘం నాయకులపై చేయి చేసుకున్న కౌన్సిలర్

calendar_today March 26, 2026
person Prajagalam News
  1.    
తాండూర్: అధికార పార్టీ కౌన్సిలర్ రజక సంఘం నాయకుల పై దాడి చేసిన సంఘటన తాండూరు పట్టణంలోని 22వ వార్డు గొల్ల చెరువులో చోటుచేసుకుంది.రజక సంఘం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కృష్ణ, రజక సంఘం అధ్యక్షుడు రాజులు తెలిపిన వివరాల ప్రకారం 22వ వార్డు కౌన్సిలర్ రాము ధోబి ఘాట్ ప్రహరీ గోడను కూల్చివేయడంతో ఎందుకు కూల్చారని ప్రశ్నించగా మాపై దాడి చేశారని,తమను కులం పేరుతో దూషిస్తూ, తీవ్రమైన పదజాలంతో చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.కులం పేరుతో దూషించిన రాముపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియొడల రజక సంఘం ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.