శీనన్నను ఆహ్వానించిన జాతర ఉత్సవ కమిటీ
April 4, 2026
Prajagalam News
(తాండూర్)
తాండూర్ లో కొలుదిరిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ బి ఓ ఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 7వ తేదీ నుండి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగుతాయని ఇందులో భాగంగా రథోత్సవం ఏప్రిల్ 11వ తేదీ రాత్రి 11 గంటలకు నిర్వహిస్తామని, 12న రాత్రి 10 గంటలకు లంకాదాహనం మహా ఘట్టం ఉంటుందని ఉత్సవాలకు హాజరుకావాలని ఫెస్టివల్ కమిటీ సభ్యులు అధ్యక్షులు మేడి మహేష్, గంగా శ్రావణ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మాద్రికి చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూరు సంకేత్ లు ఆహ్వాన పత్రిక అందజేసి శీనన్నను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు.