schedule Thursday, May 21, 2026

​కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన రిపోర్ట్ అబద్ధాల పుట్ట.... పెద్దేముల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య

calendar_today April 18, 2026
person Prajagalam News
​కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన రిపోర్ట్ అబద్ధాల పుట్ట.... పెద్దేముల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య
  ​ (తాండూర్) తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని, ఇది మాల సామాజిక వర్గ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని పెద్దముల్ మండల మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓ ప్రకటనలో అంజయ్య మాట్లాడుతూ మాల కులం,మరియు 26 ఉపకులల ​జనాభా తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉపకులాలతో కలిపి వర్గీకరణ విషయంలో మాల, మాల ఉపకులాల జనాభా,అదేవిధంగా కేవలం వర్గీకరణ విషయంలో విడుదల చేసిన సందర్భంగా మాల కులం సింగిల్ జనాభా 1527143 చూపెట్టడం,మరియు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సర్వే ప్రకారం 1469463 గా తగ్గిచ్చి చూపెట్టడం ,అన్ని కులాల జనాభా పెరిగితే కేవలం మాల కులం యొక్క జనాభాను తగ్గిచ్చి చూపెట్టడం చేస్తే ఈ ప్రభుత్వం మాలలకు ఎంత అన్యాయం చేస్తుందో అర్థమౌతుందని అన్నారు. మాల ఉప కులం ఐన మాదాసి కురావ జనాభా వర్గీకరణ చేసినప్పుడు 3707 గా చూపెట్టడం జరిగింది.ఇప్పుడు 53367 గా చూపెట్టడం జరిగింది. ఇది వాస్తవం జనాభా పెరిగింది ,కానీ మాల మాల అనుబంధ 26 కులాలను వేరు చేసి కేవలం మాల కులం యొక్క జనాభాను 1471514 చూపెట్టడం ,మళ్ళీ షెడ్యుల్డ్ క్యాస్ట్ లో ఉన్న కులాలను గందరగోళంలో పడేయడం జరిగిందని 15 ఏళ్ల తర్వాత పెరగాల్సింది పోయి ఎలా తగ్గుతుందని వారు ప్రశ్నించారు. గడిచిన కాలంలో జనాభా కనీసం 20 లక్షలు దాటాల్సి ఉండగా, ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపారని ఆరోపించారు.ఉపకులాల విభజన కుట్ర బేడా బుడగ జంగలు, మాల సాలె, నేతకాని, మహర్, మదాసి, మాల దాసరి, బేగరి వంటి మాల అనుబంధ ఉపకులాలను మాలల నుండి వేరు చేసి చూపడం ద్వారా మాల సామాజిక వర్గ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అనేక గ్రామాల్లో ఎన్యుమరేటర్లు అసలు సర్వే చేయలేదని చాలా కుటుంబాల దగ్గరికి వెళ్లకుండానే డేటా ఎంట్రీ సెంటర్లలో తప్పుడు వివరాలు నమోదు చేశారని ఆరోపించారు. మాలల జనాభాను తగ్గించడం వెనుక సామాజిక, రాజకీయ, విద్యా మరియు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే కుట్ర ఉందని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణను సమర్థించుకోవడానికే ప్రభుత్వం ఈ దొంగ లెక్కలను సృష్టించిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలను తుడిచిపెట్టాలని చూస్తే, మాలల పంతమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతం అవుతుందని అన్నారు.రాబోయే కేంద్ర ప్రభుత్వ జనగణనలో మాలలందరూ చురుగ్గా పాల్గొని మన కులాన్ని స్పష్టంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఈ తప్పుడు రిపోర్ట్‌ను వెనక్కి తీసుకుని, పారదర్శకమైన గణన చేపట్టాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.