schedule Thursday, May 21, 2026

రైతులు సౌరశక్తిని వినియోగించుకుని ఖర్చులను తగ్గించుకోవచ్చు:- పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి

calendar_today May 11, 2026
person Prajagalam News
రైతులు సౌరశక్తిని వినియోగించుకుని ఖర్చులను తగ్గించుకోవచ్చు:- పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి
  (ప్రజాగళం,కుల్కచర్ల) ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకం ద్వారా రైతులు సౌరశక్తిని వినియోగించుకొని వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో ప్రధాన మంత్రి కుసుమ్ పథకం ద్వారా కొకటం వెంకట రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో రూ.7.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి సోలార్ పవర్ ప్లాంట్‌ను స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్,స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, అధికారులు తదితరులు