schedule Thursday, September 03, 2026

జైలు భరో కార్యక్రమంతో దద్దరిల్లిన వికారాబాద్

calendar_today August 10, 2026
person Prajagalam News
జైలు భరో కార్యక్రమంతో దద్దరిల్లిన వికారాబాద్
  కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన  
  • వికారాబాద్:-
  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జైలు భరో కార్యక్రమం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం వివిధ సంఘాలు సిఐటీయూ ,ఏ ఐ కె ఎం ఎస్,ఏ ఐ కెఎస్, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన,రాస్తారోకో చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, ఏఐకె ఎమ్ ఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ లు మాట్లాడుతూ ...కార్మికులకు కనీస వేతనాలు అమలు చెయ్యాలని,కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను , విద్యుత్ సవరణ చట్టాలను ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన రాంజీ బిల్లును రద్దు చేయాలని, అడవి హక్కుల చట్టాన్ని నీరుగారుస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని రైతులకు గిడ్డబాటుదారాలు కల్పించాలని డిమాండ్ చేశారు.మార్కెట్ షెడ్లు ఏర్పాటు చేసి ఎం ఎస్ పి అమలు చేయాలని స్వదేశాన్ని వ్యవసాయాని వీడి విదేశీ వాణిజ్య ఒప్పందo చేసుకోవడం వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, అందరిని ప్రభుత్వ ఉద్యోగా గుర్తించాలని, అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయనిచో కార్మికులు రైతులు కూలీలు పోరాటాల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం, ఏఐకేఎం,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు తేజా,గిరిజన సంఘం శ్రీనివాస్ మహిళా సంఘం, అనసూయ, లక్ష్మి, కెవిపిఎస్ జిల్లా అధ్యకులు నవీన్, మల్లేష్ లక్ష్మమ్మ, జ్యోతి ఆశ రాములు రాజు వినోద్ సురేష్ బాబా ప్రవీణ్ జాఫర్ రాజు వేణు గోపాల్ బుచ్చయ్య రాజు ,నాయకులు మున్సిపల్ తదితర రంగాల కార్మికులు నర్సింలు సతీష్, నర్సమ్మ శ్రీనివాస్ రాజు పెంటయ్య పాల్గొన్నారు.