schedule Thursday, September 03, 2026

డిజేలకు అనుమతులు తప్పని సరి

calendar_today September 2, 2026
person Prajagalam News
డిజేలకు అనుమతులు తప్పని సరి
⇒వికారాబాద్ సిఐ రఘు కుమార్
  • Vikarabad :-రానున్న పండుగలు ఊరేగింపులను దృష్టిలో పెట్టుకొని,డిజే లకు అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని డీజే అపరేట్లకు వికారాబాద్ సిఐ రఘు కుమార్ తెలిపారు.బుధవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో వికారాబాద్ మండలంలోని డీజే ఆపరేటర్స్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వికారాబాద్ సిఐ రఘు కుమార్ మాట్లాడుతూ....డీజే నిర్వాహకులు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.సౌండ్ లెవెల్ ఎక్కువ పెట్టారాదని,సమయ పరిమితి ఉండాలన్నారు. అనుమతించిన సమయం మాత్రమే డీజే పెట్టాలని,ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, నివాస ప్రాంతాల వద్ద అధిక శబ్దం చేయకూడదని తెలిపారు. ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా, అసభ్యకరమైన పాటలు పెట్ట వద్దని సూచించారు.మద్యం సేవించి పాల్గొనడం నివారించాలని,మైనర్ల భద్రత,పోలీసుల సూచనలు పాటించాలని అన్నారు.బందోబస్తు సిబ్బంది ఇచ్చే సూచనలను వెంటనే పాటించాలని,పరిస్థితి అదుపు తప్పేలా ఉంటే డీజేని ఆపాల్సి ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ భద్రత – వైరింగ్, జనరేటర్, స్పీకర్లు తదితరాలను సురక్షితంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.అనుమతి నిబంధనలు ఉల్లంఘించినా, అధిక శబ్దం చేసినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రఘు కుమార్ తెలియజేశారు.