స్పోర్ట్స్ అథారిటి అఫ్ ఇండియా కు జిల్లా విద్యార్థిని ఎంపిక..
August 12, 2026
Prajagalam News
⇒హర్షం వ్యక్తం చేసిన స్థానికులు
- వికారాబాద్ జిల్లా-:కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని మారుమూల గ్రామం సామాన్య కుటుంబానికి చెందిన విద్యార్థిని నిరూపించింది.. ఒక సాధారణ బ్యాటరీ మెకానిక్ కూతురు దేశంలోనే అతన్నత ప్రమాణాలు గల స్పోర్ట్స్ అథారిటి అఫ్ ఇండియా ట్రయినింగ్ సెంటర్ కు ఎంపికయ్యింది..కుల్కచర్ల మండలం చెల్లాపూర్ కు చెందిన విశ్వనాధ్ గౌడ్ విద్య దంపతులు పరిగిలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు అక్షర శ్రీ ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకింపేట్ లో 9వ తరగతి చదువుతుంది. తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్ లో చదువుతూ ప్రస్తుతం ఫెన్షింగ్ విభాగం లో శిక్షణ పొందుతుంది. గతంలో నాలుగు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది. ఇప్పటి వరకు ఫెన్సింగ్ విభాగంలో మూడు నేషనల్స్ అడగా మహారాష్ట్ర, మణిపూర్ నేషనల్స్ లో మెడల్స్ సాదించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ వారణాసి జరిగిన పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొని అరింటికి ఆరు విభాగల్లో గెలుపొందటం ద్వారా సత్తా చాటింది.. ధీంతో విద్యార్థినిని స్పోర్ట్స్ అథారిటి అఫ్ ఇండియా వారణాసి కి ఎంపిక చేశారు.. సాయి అకాడమీ మరియు స్పోర్ట్స్ అథారిటి అఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి కామన్ వెల్త్ , ఆసియా తదితర అంతర్జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొనేందుకు నిష్ణాతులుగా తయారు చేయనున్నారు. తెలంగాణ నుండి నలుగురు విద్యార్థులు ఎంపికవగా జిల్లా నుండి అక్షర శ్రీ ఎంపికయ్యింది.ఊహించని రీతిలో ఎంపికవటంపై క్రీడలు మరియు యువజన విభాగం వికారాబాద్ జిల్లా అధికారి నర్సింలు, హకింపెట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్పన,ఫెన్సింగ్ కోచ్ సందీప్ విద్యార్థిని ని అభినందించారు. తల్లిదండ్రులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.