schedule Friday, September 04, 2026

పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం

calendar_today March 20, 2026
person Prajagalam News
పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం
పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం అంత్యక్రియలకు 5వేల ఆర్థిక సహాయం అందజేత బిఆర్ఎస్ పార్టీ యువనేత ఘణాపూర్ వెంకట్   Vikarabad-: పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటామని బిఆర్ఎస్ పార్టీ కుల్కచర్ల మండల యువనేత వెంకట్ అన్నారు.కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన ఇస్నాపల్లి నాగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ యువనేత వెంకట్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఓదార్చారు. అంత్యక్రియల కోసం తన వంతుగా 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డి.పండు,డి.మల్లేష్,వి. బీరయ్య బిజ్జారం రాములు బిజ్జారం పెద్ద సాయన్న ఇస్నపల్లి నర్సింలు బిజారం నారాయణ బిజారం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.