schedule Friday, September 04, 2026

ఫ్రంట్‌లైన్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

calendar_today September 4, 2026
person Prajagalam News
ఫ్రంట్‌లైన్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

• ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు..

• సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యం

  (తాండూరు)   ఫ్రంట్‌లైన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతను తెలియజేసేలా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. చిన్నారుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఈ వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.