schedule Friday, September 04, 2026

రోహిత్ రెడ్డి సస్పెన్షన్‌పై స్పష్టత ఏది..!

calendar_today September 4, 2026
person Prajagalam News
రోహిత్ రెడ్డి సస్పెన్షన్‌పై స్పష్టత ఏది..!
 

• బుయ్యని సోదరుల సేవపై విమర్శలు ఎందుకు

• తాండూర్ నియోజకవర్గ యువ నేత వికాస్ జోషి

(తాండూర్) బుయ్యని బ్రదర్స్‌పై నిరాధార విమర్శలు చేయడం మానుకోవాలని తాండూర్ నియోజకవర్గ యువ నేత వికాస్ జోషి అన్నారు. గుడులు, బడులు అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేకే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో నిరూపించాలని కోరారు.రోహిత్ రెడ్డి విషయంలో పార్టీ పరంగా తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని వికాస్ జోషి అన్నారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు తమ రాజకీయ వ్యవహారాలపై స్పష్టత ఇవ్వడం మంచిదని సూచించారు. బిఎస్ఆర్  షాడో ఎమ్మెల్యే కాదు.. ప్రజల మధ్య ఉండే ప్రజా సేవకులు అని స్పష్టం చేశారు. 2020లో కరోనా కష్టకాలంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఉచితంగా శానిటైజర్లు పంపించి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు.కుల, మత, వర్గ, వయోభేదాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆపన్నహస్తంతో ఆదుకోవడం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సేవా స్వభావమని అన్నారు.ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న బుయ్యని సోదరుల సేవలను విమర్శలతో తగ్గించలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వికాస్ జోషి స్పష్టం చేశారు.