• మైనారిటీ అధ్యక్షుడు ఖాజా సలాఉద్దీన్ అహమ్మద్ వినతి
(తాండూర్)
బెల్కటూర్లోని రాహుల్ హుస్సేన్ దర్గాకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, భక్తులకు మెరుగైన వసతులు అందించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు ఖాజా సలాఉద్దీన్ అహమ్మద్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా దర్గాకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివస్తుంటారని, అయితే సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. దర్గా పరిసరాల్లో రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్, డ్రైనేజీ, పారిశుద్ధ్య చర్యలు, లైటింగ్ తదితర సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.రాహుల్ హుస్సేన్ దర్గా అభివృద్ధి చెందితే భక్తులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, బెల్కటూర్ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఖాజా సలాఉద్దీన్ అహమ్మద్ పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.