మా ఎమ్మెల్యేకు క్లీన్ ఇమేజ్.. బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి
calendar_today
September 4, 2026
person
Prajagalam News
• భద్రేశ్వర ఆలయ అభివృద్ధికి పూనుకున్న ఏకైక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
• ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మహోన్నత వ్యక్తి
• భద్రేశ్వర దేవాలయం రేవనేషన్ కమిటీ చైర్మన్ మేడి మహేష్
(తాండూర్)
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై కొందరు చేస్తున్న ఆరోపణలు, బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని భద్రేశ్వర దేవాలయ రినోవేషన్ కమిటీ చైర్మన్ మేడి మహేష్ సూచించారు. భద్రేశ్వర దేవాలయంలోని దాసోహంలో కమిటీ సభ్యులు,దేవాలయ దుకాణ సముదాయ యజమాలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని, దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ముందుచూపుతో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.ఎన్నికల సమయంలో వీరశైవ సమాజానికి ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలిచిన అనంతరం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టారని మేడి మహేష్ తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలల్లోనే భద్రేశ్వర ఆలయంలో దాసోహం నిర్మాణాన్ని చేపట్టి, నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా భక్తులకు మరింత సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. భద్రేశ్వర దేవాలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా తాండూరు ప్రత్యేక గుర్తింపుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని మేడి మహేష్ అన్నారు. ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.గతంలో శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయాన్ని పునర్నిర్మించి ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడం ద్వారా ఆలయ పరిసరాలకు కొత్త రూపు తీసుకొచ్చారని చెప్పారు. అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాల వ్యాపార అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నూతన దుకాణ సముదాయాలను కేటాయించే చర్యలు చేపట్టడం ద్వారా వారికి జీవనోపాధికి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆలయం ముందు నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యను దుకాణ సముదాయం సెట్ బ్యాక్ ద్వారా తీర్చిన ఘనత ఎమ్మెల్యే మనోర అన్నదేనని అన్నారు.ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా నూతన దుకాణ సముదాయాలను ఏర్పాటు చేయడం ముందుచూపుతో కూడిన నిర్ణయమని మేడి మహేష్ అన్నారు. భక్తులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయడమే మా ఎమ్మెల్యే లక్ష్యమని తెలిపారు.గత బీఆర్ఎస్ పాలనలో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మేడి మహేష్ విమర్శించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపుతున్నారని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు స్థానిక వ్యాపారుల సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.“భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి ముందుచూపుతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, గెలిచిన కొద్ది నెలల్లోనే దాసోహం, నిత్య అన్నదానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత మనోహర్ రెడ్డికే దక్కుతుంది” అని మేడి మహేష్ అన్నారు. అనంతరం భద్రేశ్వర దుకాణదారులు మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన మా దుకాణాలు ఎమ్మెల్యే మనోరైన చూడవద్దు సువిశాలంగా ఆకర్షినియంగా నూతన దుకాణాలను ఏర్పాటు చేసుకున్నామని మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని అన్నారు. దుకాణ నిర్మాణాలు కూడా మేమే ముందుండి మా ఇంజనీర్ల సహకారంతో నిర్మించేలా కృషి చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రెవనేషన్ కమిటీ సభ్యులు దేవనూర్ శంకర్, శెట్టి చంద్రకాంత్,గాజుల విజయ్ కుమార్ అగ్గనూర్ సంకేత్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్, భద్రేశ్వర దుకాణ సంబంధాల యజమానులు సునీల్, శేషు ,మాణిక్ రావు, సుధాకర్ రమేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు