schedule Thursday, September 03, 2026

ఉపాధి హామీలో అవకతవకలు లేకుండా చూడాలి కుల్కచర్ల ఎంపిడిఓ రామకృష్ణ నాయక్

calendar_today May 15, 2026
person Prajagalam News
  (కుల్కచర్ల,ప్రజాగళం) ఉపాధి హామీలో అవకతవకలకు తావులేకుండా పనులు చేయించాలని ఎంపిడిఓ రామకృష్ణ నాయక్ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కొలతలు చూపించి కూలీలతో పనులు సక్రమంగా చేయించాలన్నారు. ఉపాధి హమీ కూలీలు వేసవి తీవ్రతాను దృష్టిలో పెట్టుకొని ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని,ఉదయం 6గంటలకు వచ్చి 10లోపు పనులను పూర్తి చేసి వెళ్లాలని సూచించారు. ప్రతి రోజు ఫోటో క్యాప్చర్ బయోమెట్రిక్ హాజరు తప్పకుండా తీసుకోవాలని అన్నారు.అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పృథ్వి రాజు,పంచాయతీ కార్యదర్శి ఎల్లమ్మ,ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రమౌళి,బొయిని సాయన్న,జలీల్ మెట్లు,కూలీలు, రైతులు పాల్గొన్నారు.