schedule Thursday, September 03, 2026

ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి

calendar_today September 3, 2026
person Prajagalam News
ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి
 

⇒మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

  • Vikarabad -: ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి,వాటిని నేరవేర్చకుండా రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనను నిరసిస్తూ చేపట్టిన బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా కోట్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో శ్రీశైల్ రెడ్డితో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ...ప్రజలు కాంగ్రెస్ వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని అనుకోని ఓట్లు వేసి గెలిపిస్తే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు చేసిండు అన్నారు.కేసీఆర్ ఇప్పుడు ఎకరాకు రూ.10,000 ఇస్తున్నారు. నేను వస్తే ఎకరాకు రూ15,000 ఇస్తా” అని రేవంత్ రెడ్డి చెప్పి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు.కనబడిన దేవుళ్లపై మొత్తం ఒట్టు పెట్టారు. కానీ ఇప్పుడు ఊర్లలో రుణమాఫీ కాని రైతులు ఎంతమంది ఉన్నారో కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు.“రైతు బీమా కింద వచ్చే రూ.5 లక్షలు ఇప్పుడు వస్తలేవు. రైతు బీమాను కూడా రేవంత్ రెడ్డి బంద్చేసిండు. అని చెప్పారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, రైతు పక్షాన నిలిచేది బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కోట్ పల్లి మండల మాజీ అధ్యక్షులు సుందరి అనిల్,బీఆర్ఎస్ నాయకులు వెంకట్ యాదవ్, పిఎస్ఏ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సావిత్రి దశరథ్ గౌడ్,ఏఎంసి మాజీ చైర్మన్ మహేందర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు ,మాజీ రైతుబంధు అధ్యక్షుడు మల్లేశం, సర్పంచులు హుస్సేన్, రవి, సుధాకర్,సదత్ పటేల్, మాజీ సర్పంచులు రామచందర్, గొడ్డలి మల్లన్న, మాల్ రెడ్డి, కృష్ణ, వెంకట్,పెంటారెడ్డి,నాయకులు మల్లేశం,మధు రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,లింగారెడ్డి,యూత్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి,అరుణ్, సంతు,కోట్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్,ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింలు,ఉప సర్పంచులు మైసయ్య,మైబు,అనిల్,సురేష్,నాయకులు బాబు నాయక్,గౌరి శంకర్,శ్రీనివాస్, మొగులయ్య,సర్ధార్, యేసు, పూర్చొతం,మహిళలు యువజనులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.