విలేమూన్ హైస్కూల్ చౌరస్తాకు అధికారికంగా పేరు ఖరారు
calendar_today
September 3, 2026
person
Prajagalam News
• హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ ను సన్మానించిన వీలేమన్ స్కూల్ ప్రతినిధులు
(తాండూరు)
పట్టణంలోని ప్రముఖ విలేమూన్ హైస్కూల్ చౌరస్తాకు విలేమూన్ హైస్కూల్ చౌరస్తా”గా అధికారికంగా పేరు ఖరారు చేస్తూ తమ పాఠశాల పేరు పెట్టేలా కృషి చేసిన వార్డు నంబర్ 7 కౌన్సిలర్ ఇర్షాద్ను విలేమూన్ హైస్కూల్ యాజమాన్యం, సిబ్బంది ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల పేరుతో చౌరస్తా గుర్తింపు పొందడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్ ఇర్షాద్ను అభినందించారు.