schedule Thursday, September 03, 2026

కుల్కచర్ల గ్రంథాలయంలో ఘనంగా విద్యా వారోత్సవ కార్యక్రమం

calendar_today May 16, 2026
person Prajagalam News
కుల్కచర్ల గ్రంథాలయంలో ఘనంగా విద్యా వారోత్సవ కార్యక్రమం
  (ప్రజాగళం,కుల్కచర్ల ) ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పుస్తక ప్రదర్శన నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ వార్వల అంజిలయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి,ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు, ఎంఈఓ హబీబ్ అహ్మద్ తదితరులు పాల్గొని గ్రంథాలయ ప్రాముఖ్యత పుస్తక పఠన గురించి పాఠకులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి మోటివేషన్ స్కిల్స్ వారికి పుస్తకాలు ఉంటాయని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఫాల్గుణ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,గ్రంధాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.