schedule Thursday, September 03, 2026

నిరుపేద కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం:-బిజేపి వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు

calendar_today May 18, 2026
person Prajagalam News
నిరుపేద కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం:-బిజేపి వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు
(ప్రజాగళం, కుల్కచర్ల)
నిరుపేద కుటుంబాలకు ఆపత్కలంలో అండగా ఉంటామని బిజేపి వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు అన్నారు.కుల్కచర్ల మండల కేంద్రంలో శావకు యాదగిరి కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నగరంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న కరణం ప్రహ్లద్ రావు సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం అంత్యక్రియల కోసం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆయన వెంట బిజేపి సీనియర్ నాయకుడు నీరటి ఆంజనేయులు, శావకు సంతోష్,అశోక్, ముకుంద, తదితరులు ఉన్నారు