schedule Friday, June 05, 2026

సమస్యను పరిష్కరించిన్న విద్యుత్ అధికారులు

calendar_today May 30, 2026
person Prajagalam News
సమస్యను పరిష్కరించిన్న విద్యుత్ అధికారులు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలనీలో కొంత కాలంగా కన్జ్యూమర్ ఇంటి వెనకాల 11కె.వి విద్యుత్ తీగలు కిందికి జారి వేలాడుతున్న దృశ్యాన్ని బషీరాబాద్ లైన్మెన్ ఉమేష్,బషీరాబాద్ మండల ఇన్చార్జి ఏ.ఈ అరవింద్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి నూతన తంబని పాతీంచి 11 కె.వి వైర్లను కనెక్షన్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంలో కన్జ్యూమర్ హర్షం వ్యక్తం చేస్తూ లైన్మెన్,ఏఈ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంలో విద్యుత్ అధికారులు మాట్లాడుతూ కన్జ్యూమర్లకు విద్యుత్ సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి సమస్యలను తీరుస్తామని అన్నారు.మచ్చలేని మహారాజుగా విద్యుత్ అధికారీ బషీరాబాద్ లైన్మెన్ ఉమేష్ పనిచేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.