schedule Friday, June 05, 2026

నైపుణ్య శిక్షణతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు :- వికారాబాద్ జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి

calendar_today June 4, 2026
person Prajagalam News
నైపుణ్య శిక్షణతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు :-   వికారాబాద్ జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి

(ప్రజాగళం, కుల్కచర్ల)
యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని,
గిరిజన యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయ సమావేశ మందిరంలో గిరిజన యువతి యువకులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిటిడిఓ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన యువతకు ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ శిక్షణ, ఎలక్ట్రికల్, టైలరింగ్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో 3 నెలలు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఆసక్తి గల వారు సంబంధిత అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ నాయక్,మండల ఇంచార్జి రాథోడ్ రాజేందర్ నాయక్,
నైపుణ్య శిక్షణ నిర్వాహకులు విజయ్ కుమార్, రాంబాబు,మానస,వంశీ,ఎల్ఎచ్,పిఎస్ నాయకుడు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.