* వచ్చే వేసవికి కాగ్నా నది నుండి త్రాగునీరందిస్తాం
* మహిళా సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి
.... తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
( తాండూర్)
మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మహిళా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవాలలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిర మహిళా శక్తి రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను బ్యాంక్ లింకేజు ద్వారా 212 సంఘాలకు రూ.28.19 కోట్ల రుణాలను అందించినట్లు పేర్కొన్నారు. వడ్డీలేని రుణాలు 1001 సంఘాలకు రూ. 1,61,64,759(ఒక్క కోటి అరవై ఒక్క లక్ష, అరవై నాలుగు వేయిల, ఏడువందల యాభై తొమ్మిది) అందించామని తెలిపారు. అదేవిధంగా స్ర్తీ-నిధి ద్వార 332 సంఘాలకు రూ.6.67 కోట్ల రుణం మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. పట్టణంలో విధీ వ్యాపారులకు (దాదాపు 5000మందికీ) గాను దాదాపు రూ.8 కోట్ల రుణం మంజూరు చేశామని తెలిపారు. పట్టణంలో 18,600 మహిళాలకు ఇందీరమ్మ చీరల పంపిణీ చేశామని పేర్కొన్నారు.మహిళ సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని గతంలో ఎన్నడు లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామన్నారు.ముఖ్యమంత్రి తాండూర్ నియోజకవర్గంకు 4 ఆర్టీసీ బస్సులు కేటాయించడం జరిగిందని మహిళా సంఘాలకు ఆదాయ వనరులు చేకూర్చాలని ఉద్దేశ్యంతో వడ్ల కొనుగోలు కేంద్రాలు, చిరు వ్యాపారాలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీ, మహిళా శక్తి క్యాంటీన్స్, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్య సంస్థలలో మౌలిక సదుపాయల కల్పన మహిళ సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు. తాండూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మహిళా సమైక్య భవనాలు (SHG) మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రజా పాలనలో స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు వడ్డీ రహిత రుణాలు, ఉపాధి అవకాశాలు, వంటి కార్యక్రమాల ద్వారా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.నూతనంగా మంజూరైన మహిళా సమైక్య భవనాల పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. ప్రభుత్వం తరఫున తన తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే వేసవి కల్లా తాండూరు ప్రజలకు జీవనది కాగ్ననా నుండి త్రాగునీరు అందిస్తామన్నారు. అదేవిధంగా చిలుక వాగు గొల్ల చెరువు, దశలవారిగా ఆధునికరిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మా ట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని కుటుంబం సమాజం బాగుపడాలన్న అది మహిళలతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేస్తున్న ఆర్పి లకు హెల్త్ కార్డులు అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. మహిళల ద్వారా త్వరలోనే సూపర్ మార్కెట్లను సైతం ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు,కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.