schedule Saturday, June 13, 2026

బాలలు ఉండాల్సింది బడిలోనే....

calendar_today June 12, 2026
person Prajagalam News
బాలలు ఉండాల్సింది బడిలోనే....
  మదన్ పల్లి సర్పంచ్ బిళ్లపాటి విజయ లక్ష్మి వికారాబాద్ -: బాలలు ఉండాల్సింది బడిలోనే అని,పిల్లలను ఎవ్వరు కూడా పనిలో పెట్టుకోరాదని మదన్ పల్లి సర్పంచ్ బిళ్లపాటి విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా వికారాబాద్ మండలం లోని మదన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బిళ్లపాటి విజయ లక్ష్మీ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ విజయ లక్ష్మి మాట్లాడుతూ.. 18 ఏళ్ళ లోపు బాలలందరు చదువులోనే కొనసాగాలని పిల్లలతో పని చేయించుకోవడం చట్ట ప్రకారం నేరమని తెలిపారు. బాలల దోపిడీకి, అక్రమ రావాణకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు.డీఎల్ఎస్ఏ నిర్వాహకులు అడ్వకేట్ వెంకటేశం మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ళ లోపు బాలలు ఎలాంటి పనులు చేసిన నేరమేనని, బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం 18 ఏళ్ల బాలలు ప్రమాదకర పనులు చేయడం నిషేధమని చెప్పారు. సాధన ఎన్ జి ఓ జిల్లా బాద్యులు నర్సిములు మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ నిర్ములన కోసం జిల్లాలో అనేక కార్యక్ర మాలు అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడిన రోజు సందర్బంగా బాలల దోపిడికి వ్యతిరేకంగా, బాలల అక్రమ రవాణా కి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం లో సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, ఏ ఎచ్ టి యూ నిర్వాహకులు అలిమోద్దీన్, ఎంవి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్, దేవకుమారి, షి టీం నిర్వాహకులు బుచ్చేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి రమేష్, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య అధ్యక్షులు కీర్తన, ఐసిడిఎస్ సూపర్ వైజర్ షాలిని, ఏ డబ్ల్యూ టీచర్స్, ఉపాధ్యాయులు, సాధన ప్రతినిధులు రమేష్, శ్వేత, హసీనా, శివలక్ష్మి, మమత, కన్యాకుమారి, రమేష్,కిషోర బాలికలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.