schedule Saturday, June 13, 2026

మహిళా సంఘాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక  కృషి  :- వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి 

calendar_today June 11, 2026
person Prajagalam News
మహిళా సంఘాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక  కృషి  :-  వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి 
(ప్రజాగళం, కుల్కచర్ల)
గ్రామాల్లో ఉన్న ప్రతి గ్రామ సమాఖ్య సంఘంకు నూతన భవనాలు నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు గ్రామాల సర్పంచులకు వారి గ్రామాల్లో మహిళా సంఘాలకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రోసిడింగులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల స్వయం సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ మౌళిక సదుపాయాలను అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్,సర్పంచులు శాంతి తుల్సిరాం నాయక్,రాథోడ్ శ్రీనివాస్ నాయక్(జీవిఎస్),సంతోష్,మహేష్ కుమార్, సీతారాం నాయక్,భరత్, ఆంజనేయులు,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.