schedule Saturday, June 13, 2026

ప్రతి రైతు నేల ఆరోగ్య పరీక్షలు చేయించాలి. బొర్ర హెమియా తండాలో సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు :- బిజేపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు, గిరిజన మోర్చా అధ్యక్షుడు గోవింద్ నాయక్

calendar_today June 13, 2026
person Prajagalam News
ప్రతి రైతు నేల ఆరోగ్య పరీక్షలు చేయించాలి.  బొర్ర హెమియా తండాలో సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు :- బిజేపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు, గిరిజన మోర్చా అధ్యక్షుడు గోవింద్ నాయక్
  (ప్రజాగళం, చౌడాపూర్) రైతులకు,ఎస్టీ సబ్ ప్లాన్ కింద గిరిజన రైతులకు వ్యవసాయంలో ఎరువుల సమతుల్య వాడకంపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాయని, ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా బిజేపి కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల పరిధిలోని బొర్రా హెమ్యానాయక్ తండాలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రీయ సాగు పద్ధతుల ప్రాధాన్యతను వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ రాథోడ్ మాట్లడుతూ రసాయన ఎరువులను ఇష్టానుసారంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని దీనివల్ల పంట ఖర్చు పెరిగి దిగుబడి తగ్గుతుందన్నారు. ప్రతి రైతు తమ భూమిలోని పోషకాలను తెలుసుకోవడానికి నేల ఆరోగ్య పరీక్షలు చేయించాలని దీన్ని బట్టి ఏ ఎరువు ఎంత మోతాదులో వేయాలో తెలుస్తుందన్నారు. ఈ సదస్సులో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ లావుడ్యా నాయక్,జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు,గిరిజన రైతులు పాల్గొన్నారు.