schedule Thursday, September 03, 2026

రైతులు ఆందోళన చెందవద్దు-తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది  :- కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ 

calendar_today June 13, 2026
person Prajagalam News
రైతులు ఆందోళన చెందవద్దు-తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది  :-    కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ 
(ప్రజాగళం, కుల్కచర్ల)   గత రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని,శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు అంశంపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి తడిసిన ధాన్యం తరలించేందుకు లారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వహకులకు సూచించారు. ఆయన వెంట వార్డు సభ్యులు, ఐకేపీ సెంటర్ ఇంచార్జి, డ్వాక్రా మహిళలు, రైతులు ఉన్నారు.