తాండూర్ లో శ్రీ చైతన్య స్కూల్ పుస్తకాల దందా
June 13, 2026
Prajagalam News
డి ఎఫ్ ఆర్ సి కమిటీ యెక్క ప్రతిపాదనలు లేకుండానే ఫీజులో పెంపు.. పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
(తాండూరు)
తాండూర్ పట్టణంలో గల శ్రీ చైతన్య స్కూల్లో గత 20 రోజుల నుండి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ తమ ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతున్న విషయం తెలుసుకున్న పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ స్కూలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యం తమ ఇష్టానుసారంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే పుస్తకాల దందా ప్రారంభించారు అని ఒక్కొక్క తరగతికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిబంధనలు ప్రకారం స్కూళ్లలో పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ అమ్మకూడదు కానీ నిబంధనలు ఏవి పాటించకుండా తమ ఇష్టానుసారంగా ప్రతి సంవత్సరం ఇలాగే వ్యవహరిస్తున్న ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు వరకు ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం తల్లిదండ్రులకు అనుమానం కలిగిస్తుందని అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ అమ్ముతున్న పుస్తకాలలో కేవలం వారి యొక్క బ్రాంచ్ పుస్తకాలు మాత్రమే అమ్ముతూ, తిరిగి 6 వ తరగతి నుండి 10 వ తరగతి అకాడమిక్ పుస్తకాలు తిరిగి బయట వేరే బుక్ స్టాల్ లో కొనాల్సిన అవసరం వస్తుందని దీనితో తల్లిదండ్రులకు స్కూల్లో ఉన్న పుస్తకాలకు వేల రూపాయలు పెట్టి మళ్ళీ తిరిగి అకాడమిక్ పుస్తకాలను కోసం బయట కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది దీనితో తల్లిదండ్రులకు భారం అవుతుందని ఇది పూర్తిగా శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యం వారి లాభాల కోసం కేవలం వాళ్లు ఇచ్చే పుస్తకాలను వేల రూపాయలకు స్కూల్లోనే అమ్ముతూ, తల్లిదండ్రులను ,విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి శ్రీ చైతన్య స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యుు డివిజన్ అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు.