• తాండూర్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన బిజెపి నాయకులు
(తాండూర్)
పరిపాలనలో దార్శనికత,ముందుచూపు విజన్ ఉన్న నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ అని బిజెపి నాయకులు అన్నారు. ప్రియతమ నేత నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలనలో భాగంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు రైల్వే స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని రైల్వే స్టేషన్లను అత్యధికంగా తీర్చి దిద్దిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. విమానాశ్రయాలు తలదిన్నె విధంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నదని అన్నారు.తాండూరు పట్టణ రైల్వే స్టేషన్ అత్యాధునికంగా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని మేనేజర్ ని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ , పటేల్ విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్,23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గౌడ్, బబ్లు,సాయిలు,సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.