• రక్షణ నేత్రం - సురక్ష మిత్ర కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
(తాండూర్ )
యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ స్నేహమెహ్రా అన్నారు. పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన రక్షణ నేత్రం – సురక్ష మిత్ర అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని అన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రక్షణ నేత్రం, సురక్ష మిత్ర కార్యక్రమాల ద్వారా యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. పెద్ద ఎత్తున హాజరైన పాఠశాల, కళాశాల విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళల రక్షణ, ట్రాఫిక్ నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాజేష్ రెడ్డి,కౌన్సిలర్లు జంటుపల్లి వెంకట్ , దివిటి ఎల్లప్ప,తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూరు పట్టణ సీఐ పరమేష్, ఎస్‌ఐలు విట్టల్ రెడ్డి, నుమన్ అలీ, వినోద్ రాథోడ్, ప్రశాంత్ వర్ధన్, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.