schedule Thursday, September 03, 2026

ప్రతి కార్మికుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

calendar_today June 20, 2026
person Prajagalam News
ప్రతి కార్మికుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
ప్రతి కార్మికుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

 • మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి

(తాండూర్) ప్రతి కార్మికుడు నెలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి  తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పాతకిండ్, యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ కంపెనీ నిర్వహించారు. హెల్త్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్  మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం  కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలని ఆమె వివరించారు. కార్మికుల ఆరోగ్యం కోసం అందించాల్సిన పనిముట్లు, సామాగ్రిని సకాలంలో అందిస్తామని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ రాకేష్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాములు, యశోద హాస్పిటల్ కార్పొరేట్ రిలేషన్స్ డిప్యూటీ మేనేజర్ ఎన్.శ్రీధర్, డాక్టర్లు వీరారెడ్డి, అఖిల్, నీలోఫర్, కౌన్సిలర్లు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.