(తాండూర్)
మానసిక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో విలియం మూన్ గ్రౌండ్‌లో నిర్వహించిన సామూహిక యోగా అభ్యాస కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగ అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగ ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. తాండూరును ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన, అభివృద్ధి చెందిన, మాదకద్రవ్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని,విద్యార్థులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం పతంజలి యోగ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు , మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి ,పోలీస్ అధికారులు, పతంజలి యోగ సమితి సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, విద్యార్థులు మరియు పట్టణ ప్రముఖులు పెద్దద ఎత్తున పాల్గొన్నారు.