schedule Thursday, September 03, 2026

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

calendar_today June 21, 2026
person Prajagalam News
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

• ప్రభుత్వ ఆస్పత్రి పేదోడి దేవాలయం

• ఆస్పత్రిలో మందులకు కొరత లేకుండా చర్యలు

• డాక్టర్లు సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి

• తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి

  ( తాండూర్) ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదోడి దేవాలయమని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మాతశిశు ఆస్పత్రిని మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనిఖీ చేశారు."అమ్మా ఆస్పత్రి ఎలా ఉంది? ట్రీట్మెంట్ బాగా అవుతోందా? భోజనం పెడుతున్నారా? ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండని రోగులతో ఆత్మీయంగా పలకరించారు.ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని ఆరాతీశారు.ఏమైనా సమస్యలున్నాయా అని ఉద్యోగులను, నర్సులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డాక్టర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ వినయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, ఏఏంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, వైస్ ఛైర్మన్ అబ్దుల్ రజాక్, డాక్టర్లు అనిల్, ఆనంద్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.