కుల్కచర్ల మండలంలో పల్స్ పోలియోకు అన్ని ఏర్పాట్లు పూర్తి :- మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
June 27, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల వ్యాప్తంగా నేడు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం పల్స్ పోలియోపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలియో చుక్కలు వేయించడం వలన పిల్లలను దీర్ఘకాలిక రోగాల నుండి రక్షించవచ్చని వివరించారు.
కుల్కచర్ల మండలంలో మొత్తం 38 బూత్ లు ఏర్పాటు చేయడం జరిగిందని 160 మంది సిబ్బంది ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు.ఈ ర్యాలీలో ఎంఎల్.హెచ్.పి వైద్యురాలు మాధురి, హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య, పిహెచ్ సి వైద్య సిబ్బంది సుజాత, జంగమ్మ, సిరాజ్, ఆముదాల గడ్డ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.