ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి.:- జూనియర్ అసిస్టెంట్ పావని
June 27, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పించాలని తహసీల్దార్ కార్యలయం జూనియర్ అసిస్టెంట్ పావని అన్నారు.శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలో బీఎల్‌వోలు పోలింగ్ బూతు 138,139 లలో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని, ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా
ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని, ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వో లు సునీత, స్వరూప,జయమ్మ పాల్గొన్నారు.