schedule Thursday, September 03, 2026

పిల్లలకు పల్స్ పోలియో తప్పకుండా వేయించాలి :- కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు 

calendar_today June 28, 2026
person Prajagalam News
పిల్లలకు పల్స్ పోలియో తప్పకుండా వేయించాలి :-    కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు 
  (ప్రజాగళం,కుల్కచర్ల)   పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు వేయించాలని, పల్స్ పోలియో చుక్కలు వేసుకోవడం ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో రాకుండా ఉంటుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు తెలిపారు.ఆదివారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి హాజరై పల్స్ పోలియో చుక్కలు పిల్లలకు వేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని కృష్ణయ్య, ఆనందం, హన్మంత్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ యాదమ్మ, పద్మమ్మ పాల్గొన్నారు