నిండు జీవితానికి రెండు చుక్కలు :-బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు
June 28, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
నిండు జీవితానికి రెండు చుక్కలు ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు,కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య, మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు.ఆదివారంకుల్కచర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే విధంగా కుల్కచర్ల మండలంలోని అన్ని గ్రామాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు,వార్డు సభ్యులు,వైద్య సిబ్బందితో కలిసి 5సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజం కొరకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎల్ హెచ్ పి వైద్యురాలు మాధురి,దిశా అడ్వైజరీ కమిటీ సభ్యుడు జానకి రాం, కాటన్ పల్లి అంజిలయ్య, గాదె మహిపాల్,బిజేపి కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్,కలకొండ అనిల్ కుమార్,వైద్య సిబ్బంది సుజాత, శ్రీధర్, రాజు నాయక్,ఆయా గ్రామాల్లో స్థానిక సర్పంచులు,వైద్య సిబ్బంది అంగన్ వాడీ టీచర్,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.