schedule Thursday, September 03, 2026

సర్ పై ప్రతి ఓటరుకి అవగాహన కల్పించడమే లక్ష్యం:- లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్

calendar_today July 2, 2026
person Prajagalam News
సర్ పై ప్రతి ఓటరుకి అవగాహన కల్పించడమే లక్ష్యం:-     లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం గ్రామ ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రతి ఓటరుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయ్యేలా, అవసరమైన సవరణలు చేసుకునేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిఎల్ఓ దేవ్ సింగ్ నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి వరుణ్ కుమార్, బిఎల్ఓ అంజమ్మ, బిఎల్ఎ వినోద్ కుమార్, గురు శ్రీను బ్రిక్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు అంబర్ సింగ్ నాయక్, తాండ వార్డు సభ్యురాలు చంప్లి బాయి, తాండవాసులు, తదితరులు పాల్గొన్నారు.