సర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి :- ఓబీసీ మోర్చా కుల్కచర్ల మండల అధ్యక్షుడు చలివేంద్రం మహేష్ కుమార్
calendar_today
July 2, 2026
person
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కుల్కచర్ల మండల అధ్యక్షుడు చలివేంద్రం మహేష్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామపంచాయతీలోని 118 పోలింగ్ బూత్ పదవ వార్డులో సర్ పక్రియలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు తమ పేర్లను సరిచేసుకోవడంతో పాటు, కొత్తగా పేర్లను నమోదు చేసుకోవడానికి ఈ ప్రక్రియను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ సునీత,డి.వెంకటమ్మ,కారోబర్ పాండు,రూపేష్ తదితరులు పాల్గొన్నారు.