schedule Thursday, September 03, 2026

పట్నం కుటుంబాన్ని పరామర్శించిన బిఎస్ఆర్

calendar_today August 2, 2026
person Prajagalam News
పట్నం కుటుంబాన్ని పరామర్శించిన బిఎస్ఆర్
  (తాండూర్) మాతృవియోగానికి గురైన పట్నం కుటుంబ సభ్యులను ఆర్బిఓఎల్  సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మొయినాబాద్ మండలంలోని జీపీఎల్ కన్వెన్షన్‌లో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన ఆయన, దివంగత ఆత్మకు నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా పట్నం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి ఓదార్చిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, తల్లి కోల్పోవడం ప్రతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.  వారి ఆశయాలను కొనసాగించడం ద్వారా నిజమైన నివాళి అర్పించిన వారవుతారని అన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్థించారు.