schedule Thursday, September 03, 2026

గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నాం: ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్

calendar_today March 26, 2026
person Prajagalam News

గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ముజాహిద్ పూర్ సర్పంచ్,చంద్రభూపాల్, ఏఎంసీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామాభివృద్ధి దిశగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపిడిఓ రామకృష్ణ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో రోడ్డు సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.