schedule Wednesday, November 04, 2026

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం......సర్పంచ్ విజయ పవన్ యాదవ్

calendar_today November 3, 2026
person Prajagalam News
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం......సర్పంచ్ విజయ పవన్ యాదవ్
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని బొంపల్లి సర్పంచ్ విజయ పవన్ యాదవ్ తెలిపారు.మంగళవారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు గుడిసె రాములుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన సంకల్పమని అన్నారు. నూతనంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా, మరింత సౌకర్యవంతంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు.ప్రజలందరూ ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకొని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా తాము నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోసిన్ పాష, గ్రామపంచాయతీ కార్యదర్శి మీనా, రేషన్ డీలర్ నరేందర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముబేర్, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.