schedule Wednesday, November 04, 2026

బక్కయ్య గౌడ్‌కు బిఎస్ఆర్ ఘన నివాళులు.

calendar_today November 3, 2026
person Prajagalam News
బక్కయ్య గౌడ్‌కు బిఎస్ఆర్ ఘన నివాళులు.

• బాధిత కుటుంబానికి పరామర్శ

(తాండూరు)

మల్కాపూర్ గ్రామానికి చెందిన కలాల్ బక్కయ్య గౌడ్ మృతి పట్ల ఆర్బివోఎల్ సిఈవో, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బిఎస్ఆర్) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు హాజరై, భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.