ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులపై విచారణ జరపాలని ఎంపీడీవోకు వినతి.
November 3, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని,ఇండ్ల కేటాయింపు పై విచారణ జరిపి అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ దోమ మండల ఎంపీడీవో గ్యామా నాయక్ కు వినతిపత్రం సమర్పించారు.గ్రామంలోని కొంతమంది నాయకులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కై అనర్హులకు, కమీషన్లు ఇచ్చిన వారికే ఇండ్లు కేటాయిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికే ఉన్న ఇండ్లను కూల్చి మళ్లీ కొత్తవి మంజూరు చేయిస్తున్నారని, నిజమైన పేదలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి వెంకటేష్ మాదిగ, జనరల్ సెక్రెటరీ యాదయ్య, మాల మహానాడు ఉపాధ్యక్షులు ప్రభాకర్, ఏ. యాదయ్య తదితరులు పాల్గొన్నారు.