బీజేపీ కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం:- బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప
November 4, 2026
Prajagalam News
కుల్కచర్ల:-
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప అన్నారు. కుల్కచర్ల మండలం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రం ఇంచార్జి వెంకటేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి వెంకటేష్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజేపి కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్,జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్,కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నీరటి కర్ణయ్య,ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేష్, ఓబీసీ మోర్చా అధ్య క్షుడు మహేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఆంజనేయులు,పార్టీ నాయకులు అన్నసారం శ్రీశైలం,లాలు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.