గ్రామాభివృద్ధికి పాటు పడుతాం
March 29, 2026
Prajagalam News
రూ.10లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు
నారేగుడ గ్రామ సర్పంచ్ ఏలివేర్తి దీపిక దశరథ్వికారాబాద్ జిల్లా-: గ్రామ అభివృద్దే ద్యేయంగా పని చేస్తానని నారేగుడా గ్రామ సర్పంచ్ ఏలివేర్తి దీపిక దశరథ్ అన్నారు.వికారాబాద్ జిల్లా నవాబ్ పెట్ మండలం నారేగూడ గ్రామంలో ఎన్ఆర్ఈజిఏస్ రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలో నాణ్యతతో పనులు పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలు తీరుస్తామన్నారు.గ్రామ అభివృద్ధి కోసం అధిక నిధులు తెస్తామని చెప్పారు.ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పరిపాలన సాగిస్తామని అన్నారు.గ్రామంలోని అన్ని కాలనిలో సీసీ రోడ్ల పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్,గ్రామస్తులు ఉన్నారు.
Ph-:9666397626
- సుద్దగళ్ల వెంకటేష్ రిపోర్టర్