schedule Thursday, September 03, 2026

కాడ్లాపూర్, రాపోల్ రైతులకు అండగా పట్నం నరేందర్ రెడ్డి

calendar_today April 7, 2026
person Prajagalam News
కాడ్లాపూర్, రాపోల్ రైతులకు అండగా పట్నం నరేందర్ రెడ్డి
(పరిగి):-వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాడ్లాపూర్, రాపోల్ గ్రామాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా సేకరిస్తున్న నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రైతులకు అండగా రైతులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా  పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ఈ చర్యలను విరమించుకోవాలని, రైతుల పొట్ట పొట్టకూడదని బిఆరేస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువనాయకుడు కొప్పుల అనిల్ రెడ్డి,కొడంగల్ తాలుకా వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగె. శ్రీనివాస్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు