schedule Sunday, September 06, 2026

రాజ్ పుత్ సమాజ సమాజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి.... ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

calendar_today April 12, 2026
person Prajagalam News
  ఘటన స్థలాన్ని పరిశీలించిన చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ( తాండూర్)రాజ్ పుత్ సమాజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వార్డ్ నెంబర్ 5 లో రాజ్ పుత్ సమాజ కమ్యూనిటీ హాల్ నిర్మాణ శంకుస్థాపన శిలా పలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఘటన స్థలాన్ని పరిశీలించారు. పట్టణ సిఐ కి ఫోన్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన సమాజ సభ్యులతో మాట్లాడుతూ రాజ్ పుత్ సమాజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ఠాకూర్ సుభాష్ సింగ్, అధ్యక్షులు ఠాకూర్ దిలీప్ సింగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నిఖిత ఠాకూర్, సభ్యులు పల్లవి ఠాకూర్,ఉపాధ్యక్షులు ఠాకూర్ ఉమేష్ సింగ్, ట్రెజరర్ ఠాకూర్ ప్రతాప్ సింగ్, మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ సింగ్,ఠాకూర్ రమేష్ సింగ్, ఠాకూర్ ప్రభాకర్ సింగ్, ఠాకూర్ నర్సింగ్ సింగ్, ఠాకూర్ రాజు సింగ్, రాజపుత్ యూవదళ్ అధ్యక్షులు ఠాగూర్ దీపక్ సింగ్, ఠాకూర్ శివాజీ సింగ్, లకన్ ఠాకూర్, సురేష్ ఠాకూర్, రాజ్ పుత్ సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.